టాలీవుడ్ (Tollywood)లో ఇటీవల వివాదాలు ఎక్కువయ్యాయి. మంచు ఫ్యామిలీ, అల్లు అర్జున్, బాలీవుడ్ పై నాగవంశీ కామెంట్స్.. ఇలాంటి పలు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ డైరెక్టర్ హీరోయిన్ పై చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అన్నీ కాస్త ఎక్కువ సైజులో ఉండాలని హీరోయిన్ అన్షుకి చెప్పానంటూ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు సంచలన కామెంట్స్ చేశారు.
మహిళా కమిషన్ ఛైర్మన్ ధ్వజం
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో త్రినాథరావు (Trinadha Rao Nakkina)పై నెటిజన్లు తీవ్ర రీతిలో మండిపడుతున్నారు. ఆడవాళ్లపై అనుచిత కామెంట్లు ఏంటని ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయం తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ వద్దకు చేరింది. దీనిపై కమిషన్ ఛైర్ పర్సన్ (Women Commission Chairoerson) నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసు జారీ చేస్తామని ఛైర్ పర్సన్ తెలిపారు.
ఇంతకీ డైరెక్టర్ ఏమన్నారంటే..?
ఇటీవల ‘మజాకా’ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షుపై అనుచిత కామెంట్స్ చేశారు. మన్మథుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా.. అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నబడిందని.. అయితే తాను ఆమెకు తెలుగుకు ఇలా ఉంటే సరిపోదని చెప్పానని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కాస్త అన్నీ ఎక్కువ సైజులో ఉండాలని హీరోయిన్ కు చెప్పానని అనుచిత కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ పై నెటిజన్లు ఫైర్
ఆయన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. దీంతో అసభ్యకర కామెంట్స్ చేశాడంటూ నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. దర్శకుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళలపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇక తాజాగా.. ఈ విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. త్వరలోనే కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Oreyy night time chatting lo matladinattu public lo ala matladtunadu enti ra !!#Mazaka #SundeepKishan #TrinadhaRaoNakkina pic.twitter.com/T2I3aQEUWK
— Kothimeer Katta (@kothimeer_katta) January 12, 2025






