ఇకపై నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు హీరో రిక్వెస్ట్

కోలీవుడ్ నటుడు జయం రవి తన అభిమానులకు కీలక రిక్వెస్ట్ చేశారు. ఇకపై తనను జయం రవి (Jayam Ravi) అని పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. తన అసలు పేరు రవి మోహన్‌ అని అయినా (Ravi Mohan) లేదా రవి అనే పేరుతో అయినా పిలవాలని కోరారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ పేరునే కొనసాగించాలని తాను అనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా నోట్‌ విడుదల చేశారు. తన సోషల్‌ మీడియా ఖాతాల పేరునూ మార్చుకున్నారు.

పండుగ స్పెషల్ న్యూస్

మరోవైపు సంక్రాంతి పండుగ వేళ ఆయన మరో న్యూస్ కూడా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ పేరిట నిర్మాణ సంస్థను, ‘రవి మోహన్‌ ఫ్యాన్స్‌ ఫౌండేషన్‌’ ఆర్గనైజేషన్‌ను కొత్త ఏడాదిలో ప్రారంభించామని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

మీకు తిరిగివ్వాలనే

‘‘సినిమాపై ప్యాషన్‌తో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ప్రతిభను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను అందించాలనేది మా ప్రొడక్షన్‌ హౌస్‌ లక్ష్యం. అభిమానులే నా బలం. మెరుగైన సమాజం కోసం నా వంతు కృషి చేసేందుకు వారే స్ఫూర్తినిస్తుంటారు. వారికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నా ఫ్యాన్స్‌ క్లబ్స్‌ను ఒకే ఆర్గనైజేషన్‌గా మార్చాను.’’ అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులకు పొంగల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అలా జయం రవి అయ్యారు

ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే రవి. దర్శకుడు మోహన్‌ రాజా రవి సోదరుడు. ‘బావ బావమరిది’, ‘పల్నాటి పౌరుషం’ చిత్రాల్లో బాల నటుడిగా రవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.  ఇక తమిళ్‌లో ‘జయం’ (తెలుగు సినిమా జయం రీమేక్‌)తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రవి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రవి కాస్త.. ‘జయం రవి’గా మారారు. గతేడాది ‘సైరెన్‌’, ‘బ్రదర్‌’ చిత్రాలతో అలరించిన ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *