సంక్రాంతి(Sankranti)కి ఒక్కో చోట ఒక్కో క్రీడకు సంబంధించి పోటీలు(Games) నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఆంధ్రప్రదేశ్(AP)లో గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఫేమస్ అయితే.. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ(TG)లోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్(Kite Festival) జరుపుతారు. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏటా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంప్రాదాయంగా వస్తోంది. ఇక తమిళనాడులోని ప్రజలకు ఈ పొంగల్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే అక్కడ జల్లికట్టు(Jallikattu) పోటీలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా జల్లికట్టు పోటీలు ఇవాళ ప్రారంభమయ్యాయి.
முடிஞ்சா தொட்டு பாரு..! வீரரா..? காளையா..? தப்பிக்க நினைக்கும் காளைகள்.. அடக்கி பரிசு வெல்ல காத்திருக்கும் வீரர்கள்… அனல் பறக்கும் அவனியாபுரம் ஜல்லிக்கட்டு..#Madurai | #Avaniyapuram | #Jallikattu | #Bull | #PolimerNews pic.twitter.com/3QwiazxctO
— Polimer News (@polimernews) January 14, 2025
మూడు రోజుల పాటు కొనసాగనున్న క్రీడలు
జల్లికట్టు(Jallikattu) అనేది తమిళనాడు(Tamilnadu)లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయక క్రీడ.. దీంట్లో ఎద్దుల(Bulls)కు, మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురం(Avaniyapuram)లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ కూడా చేశారు. వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

బెస్ట్ బుల్‌కు రూ.11లక్షల విలువైన బహుమతి
అయితే, మొదటి రోజు అవనియాపురం(Avaniyapuram)లో, రెండో రోజు పాలమేడు(Palamedu)లో, మూడో రోజు అలంగనల్లూరు(Alanganallur)లో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలోనూ యువకులు(Youth) ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. మధురై జిల్లాలోని అవనియాపురంలో ఏకంగా 1100 బుల్స్, 900 మంది బుల్ టేమర్స్ పోటీలో ఉన్నాయి. బెస్ట్ బుల్‌కు రూ.11లక్షల విలువైన ట్రాక్టర్, బుల్ టేమర్కు రూ.8లక్షల విలువైన కారు, ఇతర బహుమతులు ఇస్తారు. అయితే స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో ఏటా పలువురు గాయపడుతునే ఉన్నారు. ఈసారి పోటీలకు ప్రభుత్వం ఈసారి కఠిన నిబంధనలు(Strict rules) విధించింది.








