విక్టరీ వెంకటేష్(Venkatesh), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్(Hit Talk) సొంతం చేసుకుంది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకుల(Family Audians)ను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. దిల్ రాజు(Dil Raju) సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) మ్యూజిక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్(Success Meet) నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అందరికీ చాలా థాంక్స్: వెంకటేశ్
‘‘హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం డిఫరెంట్ కైండ్ అఫ్ ఎమోషన్(A different kind of emotion). సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు, శిరీష్‌కు ఇది మరో బిగ్ హిట్. అందరికీ చాలా థాంక్స్.’ అన్నారు

ఇది మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్: అనిల్
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్(Blockbuster Pongal). తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ థాంక్స్. బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం 4.30షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్(Big Success) ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. ఇది వెంకీ సార్ పొంగల్’ అని అన్నారు.
అమెరికా నుంచి అమలాపురం వరకూ..
నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ.. అమెరికా నుంచి అమలాపురం, ఆస్ట్రేలియా నుంచి అనకాపల్లి.. ఇలా షోలు పూర్తయిన వెంటనే బ్లాక్ బస్టర్ పొంగల్ అనే రిపోర్ట్స్ వచ్చేశాయి. సినిమాలో నాన్ స్టాప్‌గా నవ్వులు ఎంజాయ్ చేస్తున్నారు. మా కాంబినేషన్లో F2 బ్లాక్ బస్టర్ హిట్. F2 ని వారంలో సింపుల్‌గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్‌కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్‌కి, ప్రేక్షులందరికీ థాంక్యూ’ అన్నారు.







