సినీ తారల సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ (Sankranti) వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ పండుగ పూట సరదాగా గడుపుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల వేళ ఫ్యామిలీతో కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇళ్ల ముందు రంగవళ్లులు వేసి.. స్వీట్స్, పండుగ స్పెషల్స్ కుటుంబంతో కలిసి ఆరగిస్తూ.. సాయంపూట డాబాపైకి ఎక్కి పతంగులు ఎగురవేస్తూ హాయిగా గడిపారు.

సినీ తారల సెలబ్రేషన్స్

ఇక సామాన్య జనంతో పాటు సంక్రాంతి పండుగను సినీ సెలబ్రిటీలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పండుగ పూట కుటుంబంతో కలిసి జాలీగా గడిపారు. తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఎవరెవరు.. ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఓ లుక్కేద్దామా..?

కీర్తి-ఆంటోని తొలి పొంగల్

కొత్త జంట కీర్తి సురేశ్ (Keerthy Suresh), ఆంటోనీ తట్టిల్ తొలిసారిగా సంక్రాంతి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ జంట తమ పెట్ డాగ్స్ తో కలిసి జాలీగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ జంట కూడా తమ పిల్లలతో కలిసి పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు.

సినీ తారల సంక్రాంతి

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), డింపుల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. పతంగులు ఎగురవేస్తూ జాలీగా గడిపారు. మంచు మనోజ్ (Manchu ManojSankranti 2025, Pongal 2025, Film Stars Pongal 2025, film celebrities Pongal 2025 ), వైష్ణవ్ తేజ్ తమ ఫ్రెండ్స్, సన్నిహితులతో కలిసి పండుగ జరుపుకున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *