నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) దర్శకత్వంలో మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులకు కావాల్సిన యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్(Emotions) కూడా ఉండడంతో తొలి ఆట నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్(Positive Talk)తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. సరికొత్త అవతారంలో బాలయ్య కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. బాలయ్య మాస్ యాక్షన్, స్టెప్పులకు బాక్సాఫీస్(Box Office) వద్ద ఫ్యాన్స్ డాకు మహారాజ్ హవా నడుస్తోంది. తాజాగా ఈమూవీ కలెక్షన్ల(Collections)పై సితారా ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) ట్వీటర్ వేదికగా వెల్లడించింది.
బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్
బాలయ్య మూవీ విడుదలైన 4 రోజుల్లో ఈ చిత్రం రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) సాధించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. దీంతో బాలయ్య అభిమానులు ఎంతో ఖుషీగా ఉన్నారు. తొలి రోజే ఈ చిత్రం రూ.56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్(Highest openings)గా నిలిచిన సంగతి తెలిసిందే. మరో రెండు, మూడు రోజులు సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience’s love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥
𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO
— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025
కాగా ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్(Pragya Jaiswal, Shraddha Srinath)లు బాలయ్యకు జోడీగా నటించారు. బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరిలు కీలక పాత్రలను పోషించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.







