ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) తర్వాత భారత జట్టు కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇక ఈనెల నుంచి మళ్లీ టీమ్ఇండియా(Team India) మైదానంలోకి దిగనుంది. ఈ టూర్‌లో భారత్ జట్టు ఇంగ్లండ్(England)తో 3ODIలు, 5 T20లు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు BCCI యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టుతో వన్డే సిరీస్, వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ఇవాళ భారత జట్టును ఎంపిక చేయనుంది.
వారిద్దరి ఫిట్‌నెస్‌పై నేడు క్లారిటీ
ముంబయిలో ఇవాళ టీమిండియా సెలక్షన్ కమిటీ(Selection Committee) సమావేశం కానుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Chairman Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్లను ప్రకటించనున్నారు. ఈ సమావేశం ముగిశాక జట్లను ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో గాయపడి మ్యాచ్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్ నెస్‌పై నేడు కెప్టెన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. అలానే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kukdeep Yadhav) ఫిట్ నెస్ పైనా ఓ క్లారిటీ రానుంది. కాగా ఇంగ్లండ్‌తో భారత్ తొలుత 5T20 మ్యాచులు ఆడనుంది. అనంతరం 3 వన్డేల్లో పోటీపడుతుంది.

* T20 షెడ్యూల్ ఇలా..
☛ జనవరి 22 – తొలి టీ20, కోల్‌కతా
☛ జనవరి 25 – రెండో టీ20, చెన్నై
☛ జనవరి 28 – మూడో టీ20, రాజ్ కోట్
☛ జనవరి 31 – నాలుగో టీ20, పుణే
☛ ఫిబ్రవరి 02 – ఐదో టీ20, ముంబై (అన్ని మ్యాచులు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి)
* వన్డే షెడ్యూల్ ఇలా..
☛ ఫిబ్రవరి 06 – తొలి వన్డే, నాగ్‌పూర్
☛ ఫిబ్రవరి 09 – రెండో వన్డే, కటక్
☛ ఫిబ్రవరి 12- మూడో వన్డే, అహ్మదాబాద్ (అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30కి ప్రారంభమవుతాయి)






