ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Sessions 2025) జరిగే అవకాశం ఉంది. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత సమావేశాలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
తొలి విడతలోనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ (Union Budget 2025)ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5వ తేదీన పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ప్రకటించారు.






