Thaman: డియర్ తమన్.. నీ మాటలు మనసును తాకాయి: మెగాస్టార్

‘‘ఇటీవల సోషల్ మీడియా(Social Media) చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటి(Negativity)నే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు’’ అంటూ ‘డాకు మ‌హారాజ్(Daaku Mahaaraj)’ స‌క్సెస్ మీట్‌లో త‌మ‌న్(Thaman) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. త‌మ‌న్ మాటల‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastra Chiranjeevi) స్పందించారు. త‌మ‌న్ మాట్లాడిన మాట‌లు హృద‌యాన్ని తాకేలా ఉన్నాయ‌న్నారు. మ‌న‌సు ఎంత క‌ల‌త చెందితే అంత‌లా మాట్లాడాడు అనే విష‌యం అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

“డియ‌ర్ త‌మ‌న్‌.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా, మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా(SM) వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది” అని చిరంజీవి ఎక్స్‌(X)లో పోస్ట్ చేశారు.

అలా చెప్పుకోవ‌డం క‌ష్టంగా మారింది: తమన్

కాగా ఇటీవ‌ల కాలంలో మూవీ రిలీజ్(Release) అవ్వ‌క‌ముందే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయడం, సినిమాను లీక్(Leak) చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ సినిమాకు చాలా రకాల నెగిటివిటీ వచ్చింది. దీనిపై త‌మ‌న్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. ‘డాకు మ‌హారాజ్’ స‌క్సెస్ ఈవెంట్‌లో త‌మ‌న్ మాట్లాడుతూ.. ఇటీవ‌ల రోజుల్లో ఓ మూవీ హిట్ అయింద‌ని చెప్పుకోవ‌డం క‌ష్టంగా మారింద‌న్నారు. చుట్టూ నెగిటివ్ ట్రోల్స్(Trolls), ట్యాగ్స్(Tags) ఉంటున్నాయి. సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటినే అని అన్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *