సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ-అనిల్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరి సంక్రాంతికి ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించాడు అనిల్ రావిపూడి.
బుల్లిరాజా మజాకా..
ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) కామెడీ, స్క్రీన్ ప్లే గురించి ఎంతగా మాట్లాడుకుంటాన్నామో.. వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్లందరినీ పక్కన బెట్టి ఈ చిత్రంలో ఓ క్యారెక్టర్ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చంతా. ఈ సినిమాలోని ఓ పాత్రకు అటు థియేటర్లలో ఇటు సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ పాత్ర గురించే ముచ్చట్లన్నీ. ఇంతకీ ఆ పాత్రేంటంటే..?
బుల్లిరాజుకు ప్రశంసలు
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలో వెంకటేశ్ కు కుమారుడిగా నటించిన రేవంత్.. బుల్లిరాజు (Bulli Raju) పాత్రలో అదరగొట్టాడు. ఈ మూవీలో ఈ బుడ్డోడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బుల్లిరాజు పాత్ర చెప్పే ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్. ఓటీటీ కిడ్ గా ఈ సినిమాలో రేవంత్ తన పాత్రతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం రేవంత్ నటనకు నెట్టింట విపరీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బుల్లిరాజుకు మరో ఛాన్స్
అలా బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించిన రేవంత్ కు ఇప్పుడు వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయట. అయితే ఈ చిత్రంతో తనకు ఫేం వచ్చేలా చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీలో కూడా ఈ బుడ్డోడికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట. మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా తీయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రేవంత్ కు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు (Mahesh Babu) రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.






