తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy)పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం పని చేస్తున్నారు? “What Is This Nonsense?” అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళా కలెక్టర్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కరీంనగర్(Karimnagar)లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్(Manohar Lal Kattar) పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏం ఏర్పాట్లు చేశారంటూ అసహనం
కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నీటి సరఫరా వ్యవస్థను మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Kattar) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంలో మంత్రి పొంగులేటిని పోలీసులు పక్కకు తోశారు. దీంతో మంత్రి స్థాయిలో ఉన్న తనకి ఇది అవమానంగా భావించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. SP ఎక్కడ అంటూ కలెక్టర్(Collector)ను ప్రశ్నించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఇద్దరు రాష్ట్రమంత్రులు పర్యటన సందర్భంగా ఏం ఏర్పాట్లు చేశారని సీరియస్ అయ్యారు. కుమ్మరి వాడ పాఠశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలో మేమంటే రోజు ఏదో సర్దుకుంటామని, నలుగురు మంత్రులు ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితియేనా అని పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ప్రస్తుతం పొంగులేటి వీడియో సోషల్ మీడియా(SM)లో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు BRS, BJP శ్రేణులు మంత్రి పొంగులేటి తీరుపై మండిపడుతున్నాయి.
During an official event, #Telangana minister Ponguleti Srinivas Reddy anger on Karimnagar Collector says “What are you doing. no common sense”. pic.twitter.com/weMYMUKr8Y
— Aneri Shah Yakkati (@tweet_aneri) January 24, 2025








