పెద్దపులి.. దాని పేరు వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఇంకా దాన్ని దగ్గర నుంచి చూస్తే పైపై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది అడవుల్లో ఉండే ఈ మృగం ఊర్లోకి వస్తే? రావడమే కాదు మనుషులు.. పెంపుడు జంతువులపై దాడి చేసి చంపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి కేరళ రాష్ట్రంలో.. దీంతో ఓ పులిని కేరళ ప్రభుత్వం(Kerala Govt) తొలిసారిగా మ్యాన్ ఈటర్(Man Eater Tiger)గా ప్రకటించింది. అంతేకాదు అది కనపడితే కాల్చేయమంటూ ఆదేశాలూ జారీ చేసింది. ఇంతకీ కేరళ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటంటే…
అసలేం జరిగిందంటే?
ఇటీవల వయనాడ్(Wayanad) జిల్లాలో ఓ పులి ఊర్లలోకి వచ్చి మనుషులు, పెంపుడు జంతువులను టార్గెట్ చేస్తోంది. ఇటీవల వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోట(Coffee plantation)లో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల ఓ పెద్దపులి(Tiger) దాడి చేసి చంపేసింది.ఆ తరువాత ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు సమాచారం. ఈ ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగానూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అది కంటపడితే వెంటనే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్(Minister Sashindran) ఈ ప్రకటన చేశారు.
![]()
ఇదే మొదటిసారి
అంతేకాదు ఆ పులి జయసూర్య(Jayadurya) అనే అటవీ శాఖ అధికారిపైనా దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. CM పినరయి విజయన్ సూచన మేరకు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణుల సలహా అనంతరం ఆ పెద్దపులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి శశీంద్రన్ వెల్లడించారు. అయితే, ఓ పులిని మ్యాన్‌ఈటర్‌గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
48-hour curfew will be enforced in parts of #Wayanad from 6 am Monday following the death of a woman in a tiger attack.
Movement and activities will be restricted in Pancharakolly, Chirakkara, Pilakavu Moonnuroad, and Maniyamkunnu areas. Special transport services have been… pic.twitter.com/Or3RJIbogq
— South First (@TheSouthfirst) January 26, 2025






