కోతులు(Monkeys).. ప్రస్తుతం గ్రామాల్లో ఇవి చేసే బీభత్సం అంతాఇంతా కాదు. రైతులను, ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఏ ఊర్లో చూసినా కోతుల గుంపు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏది దొరికితే అది ఎత్తుకెళ్లడం.. ఇళ్లలోకి చొరబడి ఆగమాగం చేయడం.. ఎవరైనా బెదిరిస్తే మీదపడి గాయపర్చడం నిత్యం పరిపాటిగా మారింది. దుకాణాల్లో సామగ్రి, తినుబండారాలు చిందరవందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు పాఠశాలలకు వెళ్ల్లడానికి జంకుతున్నారు. కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. తాజాగా ఇవి చేసిన పనికి ఓ బాలిక ప్రాణాలు తీశాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

బాలిక చదువుకుంటుండగా..
మేడపై చదువుతున్న పదో తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా ఆ విద్యార్థి(Student)ని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బిహార్(Bihar)లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ప్రియా(Priya) ఒంటరిగా ఇంటి మేడపై చదువుకొంటున్నది. కోతుల సమూహం ఇంటి మేడపైకి వచ్చాయి.
ఆస్పత్రికి తరలించేలోపే..
ప్రియ చుట్టూ చేరి.. కోతులు బాలికపై దాడి చేశాయి. భయంతో ప్రియా ఆ కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందులో ఓ కోతి ప్రియ మీదికి దూకి మిద్దెపై నుంచి తోసేసింది. దీంతో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించారు. అయితే అప్పటికే ప్రియా మరణించినట్లు డాక్టర్లు(Doctors) నిర్ధారించారు. కోతి తోసేయడంతో మరణించిన ప్రియా మృతదేహానికి పోస్ట్‌మార్టం(Postmartam) నిర్వహించేందుకు ఆమె ఫ్యామిలీ నిరాకరించిందని పోలీసులు తెలిపారు.






