దేశంలో స్మార్ట్ యుగం నడుస్తోంది. ముఖ్యంగా కరోనా(Corona) లాక్‌డౌన్ తర్వాత ఇదీ చాలా అధికమైంది. అదే క్రమంలో ఓటీటీ (Over-The-Top)ల వినియోగమూ ఎక్కువైంది. సినిమాలు(Movies), వెబ్ సిరీస్(Webseries)లు, గేమ్ షోలతో OTTలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లు దొరకని చిన్న సినిమాలు.. ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లను నేరుగా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. పైగా ఓటీటీ కంటెంట్ వివిధ రూపాల్లో జనాలపై రుద్దుతున్నారనే ఆరోపణలూ కోకొల్లలు. అయితే ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్(Censor) చేయాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. కానీ వాటిని ఎవరూ అంత సీరియస్‌గా పట్టించుకున్నట్లు లేదు. ఫలితంగా బోలెడంత వీడియో కంటెంట్ నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటోంది.
ఎలాంటి కంటెంట్ అయినా ఇంట్లోనే చూడొచ్చు..
OTT వచ్చినప్పటి నుంచి సినిమాలకు కొరతే లేదు. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ ఇలా ఏ సినిమా కావాలంటే ఆ సినిమా ఈజీగా అందుబాటులోకి వచ్చేసింది. వివిధ రకాల కంటెంట్‌లను మనం ఏంచెక్కా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకు ముందు మనం థియేటర్(Theatre)లో సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు సినిమా ఏ సర్టిఫికేట్‌తో ఉందా లేదా కుటుంబ సమేతంగా చూడొచ్చా లేదా అని రేటింగ్ రాసేవారు. వయస్సు రేటింగ్ కూడా OTTలో వ్రాయబడినప్పటికీ, ఎవరూ దానిని పట్టించుకోవడంలేదు. ఎవరికి నచ్చిన కంటెంట్ వారు వినియోగించుకుంటారు.

తాజా మీర్‌పేట్ మర్డర్‌పైనా..
అయితే తాజాగా మరోసారి ఓటీటీల అంశం తెరపైకి వచ్చింది. సమాజంలో నానాటికీ నేరాలు(Crimes) పెగడానికి ఓటీటీలు, నియంత్రణ లేని వెబ్ సిరీస్‌ల కంటెంటేనని పలువురు ఆరోపిస్తున్నారు. వీటి వల్ల పిల్లలు చెడిపోతున్నారని అంటున్నారు. అంతెందుకు తాజాగా తెలంగాణ(TG)లో జరిగిన మీర్‌పేట మర్డర్ కేసు(Meerpet Murder Case)లోనూ వెబ్ సిరీస్ పాత్ర ఉండటం ఓటీటీలపై విమర్శలకు ఆద్యం పోస్తోంది. అందులోని ‘సూక్ష్మ దర్శిని’ వెబ్ సిరీస్ చూసే నిందితుడు గురుమూర్తి(Gurumurthy) తన భార్య మాధవి(Madhavini)ని మర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ఓటీటీ కంటెంట్ పైనా పూర్తి నియంత్రణ ఉండాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వాలు ఓటీటీ కంటెంట్‌పై ఏ మేరకు చర్యలు చేపడతాయనేది తెలియాల్సి ఉంది.









