
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ కేసులో సినీ తారలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నోటీసులు పొందడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “72 గంటల గడువు ఇస్తున్నా.. చేసిన తప్పును ఒప్పుకుని, క్షమాపణ చెప్పండి!” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఆ 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్
ఇదే సమయంలో కేఏ పాల్ ‘X’ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసు నమోదైన విజయ్ దేవరకొండ, మంచులక్ష్మితో సహా 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, రాజకీయ నేతలు వారి వద్ద డబ్బులు తీసుకొని వదిలేస్తే, తాను వారందరినీ సుప్రీంకోర్టుకు లాగుతానన్నారు. ప్రకాశ్‌రాజ్ లాగా అందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు.
Dr.K.A Paul’s strong warning to Sachin Tendulkar @sachin_rt, Vijay Devarakonda @TheDeverakonda, Bala Krishna , Manchu Laxmi @LakshmiManchu and betting APP endorsers . 72 hours deadline . @TV9Telugu @NtvTeluguLive @IndiaToday @abntelugutv @V6News @PTI_News @ANI pic.twitter.com/oA8DyROMSC
— Dr KA Paul (@KAPaulOfficial) March 23, 2025
పోలీసుల ఎదుట హాజరైన యాంకర్ శ్యామల
ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ నటులు బాలకృష్ణ, మంచులక్ష్మి, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి నిధి అగర్వాల్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. బిగ్‌బాస్ స్టార్లు, సోషల్ మీడియా ప్రభావశీలులు (ఇన్‌ఫ్లూయెన్సర్లు) కూడా ఇందులో భాగమైనట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ (మార్చి 24) యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యారు.