ఓటీటీలోకి ‘పుష్ప2 ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప2: ది రూల్‌’ (pushpa 2 ott release). డిసెంబరు 5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు రూ.1800 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. థియేటర్లలో ప్రేక్షకుల చేత జై కొట్టించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (pushpa 2 ott release platform) వేదికగా పుష్ప-2 అందుబాటులో ఉండనుంది.

ఓటీటీలోకి రీలోడెడ్ వెర్షన్

ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్‌ను డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుందంటూ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2 (Pushpa 2 Netflix)’ సినిమాకు అదనంగా మరో 20 నిమిషాల సీన్స్ యాడ్ చేశారు. అలా  3 గంటల 40 నిమిషాల నిడివి గల రీ లోడెడ్ వెరన్షన్ ను ఇప్పుడు ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోనూ రికార్డులు

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీలో శ్రీలీల కిస్సిక్ సాంగ్ లో మెరిసి అందర్నీ ఆకట్టుకుంది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.1896 కోట్లు (pushpa 2 collection worldwide) వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *