పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నాని హీరోయిన్

పెళ్లి చేసుకుంటే సినిమా ఆఫర్లు రావని గతంలో హీరోయిన్లు వయసొచ్చినా పెళ్లి మాటే ఎత్తేవారు కారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కూడా వరుస సినిమాలు చేస్తూ పలువురు హీరోయిన్లు దూసుకెళ్తున్నారు. అలా చాలా మంది తారలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆ జాబితాలో చేరింది మరో నటి.

తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమైంది నటి హరిప్రియ (Hari Priya Marriage). తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసిన ఈ కన్నడ భామ చివరకగా బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో కనిపించింది. ఇక సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి 2023 జనవరి 26వ తేదీన ప్రముఖ నటుడు, తన బాయ్ ఫ్రెండ్ విశిష్ఠ సింహాను వివాహమాడింది.

పెళ్లయిన రెండేళ్ల తర్వాత సరిగ్గా పెళ్లి రోజే ఈ ఆదివారం (జనవరి 26) హరిప్రియ పండంటి మగబిడ్డకు (Hari Priya Baby) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వశిష్ఠ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో ఓక కొత్త అధ్యాయం మొదలైంది’ అని ఆయన పోస్టు పెట్టారు. కొత్తగా తల్లిదండ్రులైన ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vasishta N Simha (@imsimhaa)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *