మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan). సూపర్ హిట్ మూవీ లూసిఫర్ (Lucifer) సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఎల్2 ఎంపురాన్ టీజర్ ను రిలీజ్ చేసింది.
సాధారణ జీవితం గడుపుతున్న స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) ఖురేషీ అబ్రహం అనే అండల్ వరల్డ్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనేది ఈ సీక్వెల్ స్టోరీ అని తెలుస్తోంది. మురళి గోపి ఈ సినిమాకు కథను అందించగా మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ లో మోహన్ లాల్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ బాగా వైరల్ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.






