‘హరిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి క్రేజీ అప్డేట్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ హీరో ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ షేర్ చేసుకుంది చిత్రబృందం.

బాబీ దియోల్ ఫస్ట్ లుక్

హరిహర వీరమల్లు సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ దియోల్ (Bobby Deol) నటిస్తున్నాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బాబీ దియోల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ లో బాబీ.. రాజుల కాలం నాటి వేషధారణలో చేతిలో కత్తితో కనిపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక హరిహర వీరమల్లు పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.

పవన్ పాట అదుర్స్

ఈ సినిమాను 2025 మార్చి 28వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ అనే పాట‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

స్వార్ట్ వర్సెస్ స్పిరిట్

రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ (Hari Hara Veera Mallu Sword Vs Spirit)’ పేరుతో ప్రేక్షకుల రాబోతోంది.  ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ దియోల్ తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *