YRF స్పై యూనివర్స్ లో ‘ఎన్టీఆర్’.. అయాన్ ముఖర్జీ మాస్టర్ ప్లాన్

ఇప్పుడంతా ఓ సినిమా చేయడం దానికి ప్రీక్వెలో లేదా సీక్వెలో.. ఇంకా వరుసగా నాలుగైదు సినిమాలు తీసేసి ఓ ఫ్రాంఛైజీ అని పేరు పెట్టడం, లేదా ఎల్సీయూ, పీవీయూ, వైఎఫ్ఆర్ స్పై యూనివర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. హనుమాన్ సినిమా తీసి తర్వాత చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచే వస్తాయని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ‘విక్రమ్’ చిత్రం తీసి అందులో రోలెక్స్ పాత్రతో ఏకంగా ఓ సినిమానే ప్లాన్ చేసి లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కు ఆజ్యం పోశాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ 

ఇక బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) గురించి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ యూనివర్స్ లో ఏకథా టైగర్ ఫ్రాంఛైజీ మూవీస్, వార్ సినిమా, పఠాన్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ స్పై యూనివర్స్ లోకి పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మరి ఈ సినిమా కథేంటి..? దీని డైరెక్టర్ ఎవరు..? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ సంగతులేంటో తెలుసుకుందాం.

వార్-2లో ఎన్టీఆర్ 

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ లతో కలిసి ‘వార్-2 (War-2)’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో తారక్ పాత్ర హృతిక్ పాత్రకు దీటుగా ఉంటుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ పాత్రలో కాస్త నెగిటివిటీ కూడా ఉంటుందని టాక్. దేశం కోసం ప్రాణాలైనా అర్పించే పాత్రలో నటించనున్న ఎన్టీఆర్ పలు కారణాలతో అదే దేశానికి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేస్తాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిసింది.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో తారక్

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పీక్ లో ఉంటాయట. అంతేకాదు ఈ పాత్రకు బలమైన ఎమోషన్ ను యాడ్ చేయబోతున్నారట. అందుకే ఈ పాత్ర ఎంత నెగిటివ్ గా ఉన్నా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారట. అయితే తారక్ ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ఓ సినిమానే చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అయాన్ ముఖర్జీ (Ayan Mukerji). ఇందుకోసం స్క్రిప్టు ప్లానింగ్ కూడా జరుగుతోందని సమాచారం. అయాన్ ముఖ‌ర్జీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తారక్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *