PM Kisan: ఈ కేవైసీకి నేడే లాస్ట్ తేది.. పూర్తిచేయకుంటే డబ్బులు పడవు!

రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKisan) 19వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎవరైతే ఈ-కేవైసీ (E-KYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని కేంద్రం తెలిపింది. జనవరి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికే నిధులు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరకే E-KYC పూర్తిచేసిన వాళ్లకి ఆధార్ నంబర్ అప్డేట్ అయినట్లు అక్కడ చూపిస్తుంది.

వారికి డబ్బులు రావు

ఇప్పటి వరకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే వారికి పీఎం కిసాన్ స్కీం కింద వచ్చే నగదు సాయం రాదు. అందుకే PM కిసాన్ పోర్టల్లో OTP ఆధారిత E-KYCని గానీ, లేదంటే దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ వద్ద బయోమెట్రిక్ ఆధారిత E-KYCని గానీ పూర్తి చేయాలి. అలాగే, ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్(Aadhar Link) అయిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్(Bank Account) అయ్యిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ ఖాతా లింక్ కాకపోయి ఉంటే ATM కేంద్రానికి వెళ్లి సర్వీస్ ఆప్షన్లో ఆధార్ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయొచ్చు.

పోర్టల్లో ఈ-కేవైసీ ఎలా చేయాలంటే..

• ముందుగా పీఎం కిసాన్ (https://pmkisan. gov.in/) వెబ్‌సైట్‌ని సందర్శించాలి. అక్కడ ఇ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్ కార్డు నంబర్ నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి.
• స్క్రీన్‌పై ఎంటర్ మొబైల్ నంబర్ అని కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి.
• ఇప్పుడు మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే E-KYC పూర్తవుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *