ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ (Telangana Assembly Sessions 2025) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సారాంశాం పేర్కొందని తెలిపారు. ఎస్సీలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం
గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ (15 ఉపకులాల జనాభా 3.288 శాతం) కల్పించాలని కమిషన్ వెల్లడించినట్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు. గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్ (18 ఉపకులాల జనాభా 62.748శాతం) ఇవ్వాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక గ్రూప్-3లోని ఎఎస్సీ 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్ (26 ఉప కులాల జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొందని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.







