సరస్వతి దేవి పుట్టిన రోజైన వసంత పంచమి సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. చాలా ప్రాంతాల్లో అమ్మవారి సమక్షంలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రామంతపూర్ లోని సరస్వతి పూజ సమితి కూడా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ సమితి ఆధ్వర్యంలో సోమవారం రోజున పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. దాదాపు 3వేల మందికి అన్నదానం చేశారు సమితి సభ్యులు. ఇక ఇవాళ ఎదులాబాద్ చెరువులో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడిలోకి చేర్చారు. వసంతి పంచమి వేడుకలను సమితి సభ్యులు సురేష్ సింగ్, రాంప్రకాష్ గుప్తా, భగవాన్ సింగ్, సునీల్ కుమార్, కమలేష్ పాండే, అజయ్ శర్మ, మంజునాథ్ గుప్తా, రాజు ధర్మేందర్, సంతోష్ గుప్తా, సన్నీ సింగ్, పవన్ రాజు రాయ్ విజయవంతంగా నిర్వహించారు.







