Sonu Sood: సోనూ సూద్‌కు అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?

ప్రముఖ బాలీవుడ్(Bollywood) హీరో సోనూ సూద్(Sonu Sood) గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్(Tollywood) కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలో సోను సూద్ఎక్కువగా విలన్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. సినిమాలతో పాటు ఈయన చేసే సేవా కార్యక్రమాల(Service programs)తో ఎంతో ఫేమస్ అయ్యారు. కొన్ని పాత్రలు చెయ్యాలంటే అది కేవలం ఆయనకే సాధ్యం..తాజాగా ఈయన పై అరెస్ట్ వారెంట్(Arrest warrant) జారీ అయింది. ఇంతకీ ఈ వారంట్ ఎందుకు జారీ అయిందంటే..

మోసం కేసులో సాక్షిగా సోనూసూద్

మోసం కేసు(A case of fraud)లో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు(Court of Ludhiana, Punjab) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్‌శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షి(Witness Sonu Sood)గా పేర్కొన్నారు.

పలుమార్లు సమన్లు పంపినా..

విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్‌కు పలుమార్లు సమన్లు(Summons) పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్(Non-bailable warrant of arrest) జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. కాగా, సోనూ సూద్ ఇటీవలే డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫతేహ్(Fateh)’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా(Cyber ​​Mafia) కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

Related Posts

బేబీ నిర్మాతకు డ్రగ్స్ సెల్ నోటీస్

సినిమా నిర్మాత ఎస్కేఎన్ కు డ్రగ్స్ సెల్ నోటీసులిచ్చింది. ఇటీవల పోలీసులు దాడి చేసిన ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో ఈ సినిమాను పోలిన సన్నివేశాలున్నాయని.. ఇలాంటివి ప్రోత్సహించేలా సినిమాలంటే చర్యలు తప్పవని యాంటీ నార్కటిక్స్ సెల్ డైరెక్టర్, హైదరాబాద్ కమిషనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *