New Ration Cards: వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి: సీఎం రేవంత్

కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఇవాళ (ఫిబ్రవరి 17) ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన(Prajapalana)లో అప్లై చేసుకున్నవారికి మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో MLC ఎన్నికలు జరుగనున్నాయని, అయితే కొత్తరేషన్ కార్డుల జారీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా లేని జిల్లాల్లో తక్షణమే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కొత్త కార్డులకు సంబంధించి రంగు, డిజైన్లను పరిశీలించారు.

కాగా, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియ చాలా రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దరఖాస్తులను పరిశీలిస్తూనే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అవకాశం కల్పిస్తోంది.దరఖాస్తుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద జనాలు గుమికూడుతున్నారు. ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ చాలా మంది మీ సేవ(Mee Seva)లో మళ్లీ దరఖాస్తులు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వారికి కోడ్ ముగియగానే అవకాశం

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎన్నికల కోడ్(Election Code) అమలులో ఉన్న విషయం తెలిసిందే. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌‌ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. అలాగే మెదక్ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంగనర్‌లోనూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC Elections) జరగనుంది. ఈ కారణంతో తెలంగాణ కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యం కానుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ జిల్లాల్లో కూడా అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *