ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh)కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా తరలివస్తున్న భక్తులతో పాటు ఇక్కడ విదేశాల నుంచి వస్తున్న వారు కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కుంభమేళాను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇవాళ సందర్శించారు.
కుటుంబ సమేతంగా పుణ్యస్నానం
ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని ఆయన అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యూపీ ప్రభుత్వాన్నికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
VIDEO | Maha Kumbh 2025: Andhra Pradesh Deputy CM and Jana Sena chief Pawan Kalyan (@PawanKalyan), along with his wife Anna Lezhneva, takes holy dip in Triveni Sangam.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/sttY59xB2B
— Press Trust of India (@PTI_News) February 18, 2025
మరో వారం రోజులు మాత్రమే
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా ఈనెల 26వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల పాటే సమయం ఉండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది.






