దసరా, హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని (Actor Nani). ఇక తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘హిట్ : ది థర్డ్ కేసు’. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ థ్రిల్లర్ మూవీ గురించి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 24వ తేదీన హిట్-3 (HIT : The 3rd Case Teaser) టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఓ చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కేజీయఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాతో ప్రొడక్షన్స్ పై నాని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హిట్ పార్ట్-1, హిట్-2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ (Adivi Sesh) కామియో రోల్స్ తో అలరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక హిట్ పార్ట్-2 క్లైమాక్స్ లో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చి హిట్-3కి హింట్ ఇచ్చినట్లుగా హిట్ ది థర్డ్ కేసులో కూడా హిట్-4 సినిమాకు సంబంధించిన హింట్ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. అయితే ఈ ఫ్రాంఛైజీలో రానున్న నాలుగో సినిమాలో (HIT 4) ఓ మాస్ హీరో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ మాస్ హీరో మరెవరో కాదట.. మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హిట్-4లో నటించనున్నాడట.






