మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఓదెల-2 (Odela-2)’. 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా.. నాగ సాధు పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తే తెలుస్తోంది.

ఇప్పుడు ఓదెల-2 గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..  ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 22వ తేదీన  మహా కుంభమేళాలో లాంఛ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా నాగసాధు లుక్ లో కనిపించింది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న తమన్నా లుక్ మీరు కూడా చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *