Daaku Maharaaj OTT: ఆ రూమర్స్‌కి చెక్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు’

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కన మూవీ “డాకు మహారాజ్(Daaku Mahaaraj). సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 170+ కోట్ల కలెక్షన్ల కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. అలాగే బాలయ్య కెరీర్‌లోనే వసూళ్ల పరంగా అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్‌(Netflix)లో సందడి చేస్తోంది.

అవన్నీ వదంతులే..

అయితే, డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముందు కేవలం ఒక్క భాషలోనే విడుదల అవుతుందని వార్తలొచ్చాయి. అలాగే బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సీన్లనూ తీసేశారన్న రూమర్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే, అవన్నీ వదంతులేనని నెట్‌ఫిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. థియేటర్ ప్రింట్‌తో అన్ని భాషల్లో NETFLIXలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే థియేటర్లలో మిస్ అయిన వాళ్లు OTTలో చూసేయండంటూ నెట్‌ఫిక్స్ ట్వీట్ చేసింది.

డాకు మహారాజ్.. బాలయ్య ఫాన్స్ అన్ హ్యాపీ? | Balakrishna Daaku Maharaja Nizam Theatre Controversy

కాగా ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) కీలకపాత్ర పోషించింది. స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్‌లో మెప్పించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించగా రికార్డు స్థాయిులో వసూళ్లు రాబట్టింది.

Related Posts

Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…

ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *