ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలుగులో ఎంతో ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR)కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా ఇండియన్ ఆడియన్స్‌కి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడీ స్టార్ హీరో బాలీవుడ్‌లో కూడా తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎన్టీఆర్ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్‌పై చూపిన అభిమానంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఆనందంతో స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ తో పని చేయడం నిజంగా నా అదృష్టం అంటూ హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఉండటం నిజంగా గొప్ప విషయం. ఈ నేపథ్యంలో హృతిక్ కు, ఎన్టీఆర్ నటించిన సినిమాలలో జనతా గ్యారేజ్(janatha garage) సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ నినిమను ఎన్నోసార్లు చూశాను. ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మేచ్యూర్డ్‌గా అనిపించింది. ఆ సినిమా నేను చేశానేమో అన్న ఫీలింగ్ కలిగింది” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా విడుదలకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, రికార్డులను బద్దలుకొట్టే హిట్‌గా మారాలని ఆశిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *