దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. యాక్షన్ అడ్వెంచర్(Action adventure)గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1500కోట్ల బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ పతాకం(Durga Arts Banner)పై డాక. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. హాలివుడ్‌కు దీటుగా డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీని పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా సైలెంట్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ ప్రారంభించిన డైరెక్టర్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించనున్నట్లు టీటౌన్లో వార్తలు వస్తున్నాయి.

ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించనున్న జక్కన్న
అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటంటే.. ‘SSMB29’ మూవీపై రాజమౌళి త్వరలో ప్రెస్ మీట్(Press Meet) పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా తన సినిమాలను ప్రారంభించక ముందే ప్రెస్ మీట్ పెట్టే జక్కన్న, ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రారంభమైన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇది ఏప్రిల్ నెలలో ఉంటుందని టాలీవుడ్ టాక్. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజమౌళి పెట్టబోయే ఈ ప్రెస్ మీట్‌పై పడ్డాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన(Official announcement) రావాల్సి ఉంది.
సింహాన్ని బోనులో బంధించి..
గత ఏడాది కాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాడు జక్కన్న. ఆ మధ్య హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఏ ఒక్క ఫొటోని బయటకు వదల్లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాలకు మాత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని లీక్ ఇచ్చాడు జక్కన్న. అందుకు సింహాన్ని బోనులో బంధించి పాస్ పోర్ట్(Passport)ను చూపిస్తూ రాజమౌళి కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. ఆ పోస్ట్‌కి మహేష్ బాబు.. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ కామెంట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియా(SM)ను షేక్ చేసింది.







