
యాదగిరిగుట్ట ఆలయం(Yadagirigutta Temple)లో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం(Divyavimana Swarna Gopura Maha kumbhabhishekam) ఎంతో వైభవంగా జరిగింది. దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ మహా క్రతువులో MP చామల కిరణ్కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన స్వర్ణగోపురం(Swarna Gopuram). భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68KGల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా మార్చారు. ఇందుకోసం రూ.80 కోట్లకు పైగా ఆలయ అధికారులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
Hon’ble CM Sri.A.Revanth Reddy participates in Maha Kumbhabhisheka Samprokshana at Yadagirigutta https://t.co/LpdSZQkWeB
— Telangana Congress (@INCTelangana) February 23, 2025
కాగా మహాక్రతువును తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. CM రావడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కాగా దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు. దీనిపై నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.