టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. SSMB29గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం గురించి మేకర్స్ అధికారిక ప్రకటనలు ఏం ఇవ్వకున్నా.. తరచూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీప్రియులకు తాజాగా మరో కిక్కిచ్చే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో ఇప్పటికే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ నటులు భాగం కానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మాలీవుడ్ స్టార్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది.
నేను రెడీ
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) SSMB 29 సినిమాలో నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ హీరో తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఈ రూమర్ ను కన్ఫామ్ చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ‘‘డైరెక్టర్ గా నా చేతిలోని చిత్రాలన్నీ కంప్లీట్ అయ్యాయి. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఓ నటుడిగా మీ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నా. పరభాష సినిమాలో నటించబోతున్నాను. ఆ సినిమాలో చాలా పెద్ద పెద్ద డైలాగులున్నాయని తెలిసి కాస్త భయమేస్తోంది.’’ అని పృథ్వీరాజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
View this post on Instagram
ఒక్క పోస్టుతో కన్ఫామ్
పృథ్వీ పోస్టు చూసి నెటిజన్లు అది SSMB 29 సినిమా గురించేనను అంటున్నారు. ఆ చిత్రం కోసమే తన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తాను మహేశ్ – రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తూ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పృథ్వీరాజ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక SSMB 29 సినిమా సంగతికి వస్తే ఇదో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది.






