
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్(Venkatesh) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. ఈ పొంగల్ కానుకగా జనవరి 14న విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ ఇప్పటికీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు(Dil Raju) నిర్మించారు. మార్చి 1న టీవీ, ఓటీటీల్లోకి ఒకేసారి వచ్చేసింది. అయినా ఇప్పటికీ పలు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డు సాధించింది. ఇంతకీ అదేంటంటే..
టీవీ, ఓటీటీలోకి ఒకేరోజు
టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకున్న సినిమాగా రికార్డు సాధించింది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత రోజుల్లో ఓ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమేనని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
#SankranthikiVasthunam Celebrating 50 Days Today
Congratulations to @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil @ItsActorNaresh @bhaskarabhatla @YoursSKrishna @prakash3933 @SVC_official pic.twitter.com/C40GOnOoxH
— MovieBuzz (@MoviesUpdatez) March 4, 2025
వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్
కాగా, విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో సూపర్ హిట్ టాక్ సాధించింది. విడుదలైన మూడ్రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించి అరుదైన ఫీట్ సాధించింది. అలాగే వెంకీ కెరీర్లోనూ కలెక్షన్ల పరంగా ఈ మూవీదే రికార్డు కావడం గమనార్హం. వెంకీ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.