Tanya Ravichandran: కెమెరామ్యాన్​‌తో హీరోయిన్​ లవ్​.. ఫొటోలు హల్​‌చల్​

కోలీవుడ్ హీరోయిన్ తాన్యా రవి చంద్రన్ (Tanya Ravichandran) ఓ ఫొటోగ్రాఫర్​తో ప్రేమలో పడిపోయింది. తన బాయ్​ఫ్రెండ్​ కలిసి దిగిన ఒక ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో అభిమానులతోపాటు సినీ తారలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాన్యాది సినిమా కుటుంబమే. తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలే తాన్యా రవి చంద్రన్.

2016లో హీరోయిన్​గా ఎంట్రీ..

తమిళ మూవీ ‘బల్లే వెళ్లైయతేవా’తో 2016లోనే హీరోయిన్​గా కోలీవుడ్​లో అడుగుపెట్టింది. కథ డిమాండ్ మేరకు గ్లామర్ పాత్రలు కూడా చేసి ట్రెండింగ్​లో నిలిచింది. ఆర్​ఎక్స్​ 100 ఫేమ్​ కార్తికేయ (Karthikeya) హీరోగా 2021లో వచ్చిన ‘రాజా విక్రమార్క’ తో టాలీవుడ్​లో తొలిసారి అవకాశం దక్కించుకుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ (God Father) చిత్రంలో నయనతారకు సోదరిగా యాక్ట్​ చేసింది. కొద్దిరోజులుగా సినిమాటోగ్రాఫర్​ గౌతమ్​ జార్జ్​తో ప్రేమలో ఉంది. తాజాగా తన బాయ్​ఫ్రెండ్​తో లిప్​ కిస్ ఇస్తూ దిగిన ఫోటోను సోషల్​ మీడియాలో షేర్ చేసింది. అయితే అతడి వివరాలతో పాటు ఫేస్​ను ఆమె రివీల్ చేయలేదు.

విషెస్​ తెలిసిన శివాత్మిక, తాప్సీ..

కానీ ఇదే ఫోటోను సినిమాటోగ్రాఫర్​ గౌతమ్ జార్జ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లకు క్లారిటీ వచ్చేసింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఆ జంటకు విషెస్​ చెబుతున్నారు. సీనియర్​ నటుడు రాజశేఖర్​ కుమార్తె శివాత్మిక, తాప్సీ, సిద్ధి ఇద్నానీ, నటుడు కాళిదాస్​ జయరామ్​ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తాన్య 2024లో వచ్చిన రసవత్తి తర్వాత మరే ప్రాజెక్టులో పనిచేయడంలేదు. గౌతమ్​ జార్జ్​ ప్రస్తుతం రాఘవ లారెన్స్, నివిన్​పోలీ​ నటిస్తున్న బెంజ్​ మూవీకి సినిమాటోగ్రాఫర్​గా పనిచేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Goutham George (@gouthamgeorge)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *