రేషన్ కార్డు మంజూరైందా లేదా? ఇక్కడ చెక్ చేసుకోండి.. రాకపోతే ఇలా చేయండి!

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు( Ration Card) కీలకంగా మారింది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలులో రేషన్ కార్డు కీలక ప్రమాణంగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకూ రేషన్ కార్డు అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది.

జూలై 14 నుంచి పంపిణీ ప్రారంభం

జూలై 14, 2025 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ( Ration Card Approved ) ప్రారంభమైంది. ఇప్పటివరకు 3 లక్షలకుపైగా కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి, సుమారు 5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు వెల్లడించారు.

కార్డుల ముద్రణ కొనసాగుతోంది

ఫిజికల్ కార్డుల ముద్రణ ఇంకా కొనసాగుతుండటంతో అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) తెలిపారు. ఇప్పటికే అంగీకరించబడిన దరఖాస్తుదారులకు త్వరలోనే కార్డులు అందిస్తామని తెలిపారు.

దరఖాస్తు ప్రక్రియ & అవసరమైన పత్రాలు

కార్డు దరఖాస్తు చేసుకునే వారు మీసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఫారమ్‌ను నింపాలి. ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలు పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పత్రాలు తప్పులుగా లేదా అసంపూర్ణంగా ఉంటే, దరఖాస్తు రిజక్ట్ చేసే అవకాశముంది.

కుటుంబ సభ్యుల వివరాలను చేర్చుకోవాలనుకునే వారు, వారి ఆధార్ కార్డులు, చిరునామా పత్రాలతో పాటు ప్రత్యేక ఫారమ్‌ను కూడా సమర్పించాలి. సమర్పించిన సమాచారం అధికారుల లాగిన్‌కు చేరిన తర్వాత, వారు పరిశీలించి అర్హులకు కార్డు మంజూరు చేస్తారు.

కొనసాగుతున్న రేషన్ కార్డుల మంజూరు

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, రేషన్ కార్డుల మంజూరు ఒక నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా, ప్రభుత్వం ఇంకా 95 లక్షల కొత్త కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరనుంది.

దరఖాస్తు స్థితి తెలుసుకోవాలంటే:

అధికారిక వెబ్‌సైట్:
👉 https://epds.telangana.gov.in/FoodSecurityAct/

లేదా సమీప రేషన్ షాపులో ఆధార్ నంబర్‌తో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు పొందడానికి అర్హత ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకొని, సకాలంలో అవసరమైన పత్రాలు సమర్పిస్తే మీకు కూడా త్వరలో రేషన్ కార్డు మంజూరు అవుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *