రామ్‌చరణ్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో రెడీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వారసుడిగా పరిచయమైన రామ్‌చరణ్(Ram Charan), ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలబడకపోయినా, ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్(Uppena Fame) సానా బుచ్చిబాబు(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది'(Peddi) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై చరణ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో రామ్‌చరణ్ రగ్గడ్ & రస్టిక్ లుక్‌లో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చే అవకాశముందని టాక్. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prashntha neel) తో చరణ్ ప్రాజెక్ట్(Ram Charan Project) ఒకటి చర్చల్లో ఉందట. తర్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

అంతేకాదు, సుకుమార్(Sukumar) దర్శకత్వంలో చరణ్ 17వ చిత్రం పట్టాలెక్కనుంది. ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ అందించిన ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2’తో నేషనల్ లెవల్‌లో సక్సెస్ అందుకున్న సుకుమార్, చరణ్‌తో మరొక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ తీసుకురానుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *