బుల్లితెర ప్రేక్షకులకు ‘బ్రహ్మముడి’ సీరియల్(Brahmamudi Serial) ద్వారా పరిచయమైన నైనిషా రాయ్(Nainisha Rai) ‘అప్పు’(Appu) పాత్రతో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా తన నిశ్చితార్థం(Engagement) వార్తతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది నైనిషా రాయ్. సహనటుడు ఆశిష్ చక్రవర్తితో కలిసి నిశ్చితార్థ ఫొటోలు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“మొత్తానికి మేం సాధించాం… చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మా రోజు వచ్చింది. నన్ను ఎప్పుడూ మద్దతుగా నిలబెట్టుకున్న ఆశిష్‌కి థ్యాంక్స్,” అంటూ నైనిషా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పింది. ఈ పోస్ట్ చుసిన ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షల చెబుతున్నారు.అయితే కొందరైతే ఇది నిజమైన నిశ్చితార్థమా? లేక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రచార ప్రొమోషన్లా అని సందేహిస్తున్నారు.
ఆశిష్ చక్రవర్తి(Aashish Chakravarthi) విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘చామంతి’(Chamanthi) అనే సీరియల్‌లో నటిస్తున్న ఈయన తమిళ సీరియల్స్‌లోనూ నటిస్తున్నాడు. ఈయన నటనకు ముందు బాడీ బిల్డర్(Body Bilder). మిస్టర్ మద్రాస్ 2018, మిస్టర్ ఇండియా చెన్నై 2017, మిస్టర్ చెన్నై ఇంటర్నేషనల్ 2019 వంటి టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. ఇటీవల ప్రసారమైన ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్’లో చామంతి టీమ్ విజేతగా నిలవడంలో కూడా ఆశిష్ కీలక పాత్ర పోషించాడు.
View this post on Instagram
ఇదిలా ఉండగా, నైనిషాకు ఇప్పటికే పెళ్లయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇది కేవలం సీరియల్ స్క్రిప్ట్ లో భాగమేనని అంటున్నారు. ఇంతకీ నిజంగా వీరి నిశ్చితార్థమేనా? లేక రియల్‌కి రీల్‌కి మధ్య ఉన్న ఓ ప్రమోషనల్ గిమ్మిక్ మాత్రమేనా? ఈ విషయంపై నైనిషా గానీ, ఆశిష్ గానీ స్పందిస్తే తప్ప తెలియదు.






