టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్'(‘The Girlfriend’), ఇది ఓ అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో రష్మిక సరసన టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్రానికి దర్శకుడిగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వ్యవహరిస్తున్నారు. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్( First Song Released) చేశారు. ఈ పాట తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
పాటలో రష్మిక, దీక్షిత్ ఎక్కువ డ్యాన్స్ చేయకపోయినప్పటికీ, వారి వెరైటీ పోజులు, ఎక్స్ప్రెషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటకు ఎమోషనల్ లిరిక్స్ తో పాటు హృద్యమైన మ్యూజిక్ కూడా తోడవడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపింది.
అయితే, ఈ వీడియో పాటపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది “ఈ పాట నీవే నుంచి కాపీలా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే “ఇది ఢీ డ్యాన్స్ షోలో వచ్చిన పర్ఫార్మెన్స్లా ఉంది” అని అభిప్రాయపడుతున్నారు.






