తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్(Actor Vishal) సినిమా రివ్యూ(Reviews)లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సమీక్షల(Public Reviews)ను రికార్డు చేయడం నిషేధించాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో, ముఖ్యంగా యూట్యూబర్లు(YouTubers), మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ‘రెడ్ ఫ్లవర్(Red Flower)’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో విశాల్ ఈ కామెంట్స్ చేశారు.

కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు
విశాల్ మాట్లాడుతూ, సినిమా రిలీజైన వెంటనే థియేటర్ల వద్ద పబ్లిక్ రియాక్షన్లు తీసుకోవడం వల్ల కొత్త చిత్రాలకు ఆదరణ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రివ్యూలు సినిమాకు సరైన అవకాశం ఇవ్వకుండా, ప్రతికూల అభిప్రాయాలతో దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం 12 షోలు పూర్తయ్యే వరకు ఇలాంటి సమీక్షలను నిలిపివేయాలని, దీనివల్ల సినిమా పరిశ్రమకు ఊపిరి పోసే అవకాశం ఉంటుందని సూచించారు.
#Vishal has sought a ban on filming public reviews at cinema theatres in the opening 3 days of a new release! It comes a few weeks after the Madras High Court dismissed a similar writ petition filed by the Tamil Film Active Producers Association that sought a ban on movie reviews… pic.twitter.com/vh6yR9X9j9
— Sreedhar Pillai (@sri50) July 16, 2025
సినీ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని
‘‘ప్రతి వారం విడుదలయ్యే అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సమయం అవసరం. అయితే, విడుదలైన వెంటనే ప్రతికూల రివ్యూలు వస్తే, సినిమా బతకడం కష్టమవుతుంది. సినీ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మీడియా, యూట్యూబర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని విశాల్ కోరారు. ఈ వ్యాఖ్యలు సినీ అభిమానులు, నిర్మాతల మధ్య మిశ్రమ స్పందనలను రేకెత్తించాయి. కొందరు విశాల్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, సినిమాకు సమయం ఇవ్వడం అవసరమని అంగీకరిస్తున్నారు. మరికొందరు మాత్రం, రివ్యూలు ప్రేక్షకుల అభిప్రాయ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని వాదిస్తున్నారు.






