Yuganiki Okkadu : రేయ్ ఎవర్రా మీరంతా.. థియేటర్లోకి మరోసారి కల్ట్ క్లాసిక్

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) డెబ్యూ మూవీ ‘యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu)’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కార్తీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో సాధారణంగా ఆడిన ఈ సినిమా తెలుగులో మాత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో కార్తీ చెప్పిన ‘రేయ్.. ఎవర్రా మీరంతా’ అనే డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ లో వాడుతుంటారంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

యుగానికి ఒక్కడు రీ రిలీజ్

ఇక కార్తీ (Karthi Movies) కూడా ఈ సినిమా తన సొంత రాష్ట్రం తమిళనాడులో సరిగ్గా ఆడలేదని.. కానీ తాను పక్క రాష్ట్రం వాడినైనా తెలుగు ప్రేక్షకులు తన మొదటి సినిమాను విపరీతంగా ఆదరించారని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకే తనకు కోలీవుడ్ కంటే టాలీవుడ్ ప్రేక్షకులంటే కాస్త ప్రేమ ఎక్కువ అని తెలిపారు. ఇక యుగానికి ఒక్కడు సినిమాకు ఉన్న క్రేజ్ చూసి మేకర్స్ మరోసారి ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు.

థియేటర్లోకి కల్ట్ క్లాసిక్

2010లో రిలీజ్ అయిన యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu Re Release) మూవీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. సెల్వ‌ రాఘ‌వ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త‌మిళంలో తెర‌కెక్కించిన ఆయురత్తిల్ ఒరువ‌న్ సినిమాకు తెలుగు అనువాద‌మే యుగానికి ఒక్క‌డు. మూడు విభిన్న కాలాల్లో సాగే ఓ అద్భుత కథతో ఈ చిత్రం సాగుతుంది. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీ, రీమా సేన్ (Reema Sen), ఆండ్రియా జెరెమయ్యా ప్రధాన పాత్రల్లో నటించారు.

రేయ్ ఎవర్రా మీరంతా?

మరోసారి థియేటర్లలో యుగానికి ఒక్కడ సందడి చేసింది. ఈ కల్ట్ క్లాసిక్ ను మళ్లీ థియేటర్లో ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ సినిమా హాళ్లకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కార్తీ స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి థియేటర్లన్నీ ఆడియెన్స్ విజిల్స్ తో హోరెత్తాయి. ఇక ఎవర్రా మీరంతా అనే డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ప్రేక్షకుల సందడితో దద్దరిల్లింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *