
దాదాపు 9 నెలలుగా అంతరిక్షం(Space)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్‌మోర్(Butch Wilmore) త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన Falcon-9 Rocket ఇవాళ (మార్చి 16) నింగిలోకి దూసుకెళ్లింది. NASA-SpaceX చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్(Kennedy Space Center) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది.
Liftoff of Crew-10! pic.twitter.com/OOLMFQgA52
— SpaceX (@SpaceX) March 14, 2025
రాకెట్ గ్రౌండ్ సిస్టంలో సమస్య కారణంగా ఆలస్యం
నిజానికీ మిషన్‌ను 12వ తేదీనే చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టంలో సమస్య కారణం(Technical Issue)గా చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. సమస్యను సరిచేసి తాజాగా ఇప్పుడు మళ్లీ చేపట్టారు. ఇక, డ్రాగన్ క్యాప్సూల్‌లో INSకు వెళ్లిన వ్యోమగాముల్లో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. అంతరిక్ష నౌక INSతో నేడు డాకింగ్ అవుతుంది. దాంతోపాటు వెళ్లిన నలుగురు వ్యోమగాములు(Astronauts) ఐఎస్ఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీత, బచ్ విల్‌మోర్ ఈనెల 19న భూమికి పయనమయ్యే అవకాశం ఉంది.
9 నెలలుగా అంతరిక్షంలోనే..
కాగా 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్(Boeing spacecraft Starliner)లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(INS)కి చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వారిని తీసుకెళ్లిన స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఒంటరిగానే భూమిని చేరుకుంది. దీంతో వారు 9 నెలలు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే.