బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 11 మంది సెలబ్రిటీలపై కేసు

ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్స్‌ (Online Betting Apps) ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత లాభం కోసం అమాయకులు మోసపోయేలా ప్రేరేపిస్తున్న పలువురు సెలబ్రిటీలపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా.. వీరి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానలేదు.

సెలబ్రిటీలపై కేసు నమోదు

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సోషల్‌ మీడియా, టీవీ నటులపై పంజాగుట్ట కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ (Tasty Teja), కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ (Vishnu Priya), యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌ లపై కేసు ఫైల్  చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *