ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్.. బుల్లిరాజుకు షాకింగ్ రెమ్యునరేషన్

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే బుల్లితెరపై, ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh), ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బుల్లిరాజ పాత్ర ప్రేక్షకులను భలే మెప్పించింది.

ఒక్క డైలాగ్.. ఒక్క సినిమాతో పాపులర్

ఈ సినిమాలో బుల్లిరాజు (Bulliraju) త‌న న‌ట‌న‌, డిక్ష‌న్‌తో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాడు. నేను కొరికేస్తాన్.. నేను కొరికేస్తాన్ అంటూ వెంకీతో కలిసి బుల్లిరాజు చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇక తండ్రిని ఎవరైనా ఒక్క మాట అంటే సహించని కుమారుడిగా, తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్న కొడుకుగా బుల్లిరాజ తన నటనతో మెప్పించాడు. అందుకే సినిమా రిలీజ్ అయిన రోజు నుండి బుల్లిరాజుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది.

రోజుకు లక్ష రూపాయలు

తొలి సినిమాతోనే బుల్లిరాజుకి (Bulliraju Remuneration) మంచి పేరు వచ్చింది. పాపులారిటీతో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే బుల్లిరాజు తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు సమాచారం. సీనియర్ నటుల రేంజులో బుల్లిరాజు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్టులకు ఈ రేంజులో రెమ్యునరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు.

నెలలో 10 క్యాల్షీట్లు

కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్ర, అతడి పర్ఫామెన్స్ ను చూసిన నిర్మాతలు తమ సినిమాల్లో బుల్లిరాజును తీసుకోవాలని చూస్తున్నారట. రెమ్యునరేషన్ కాస్త ఎక్కువైనా ఫర్వాలేదు ఈ బుడ్డోడే కావాలంటున్నారట. ఇక బుల్లిరాజు ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు, సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు. ఒక నెలలో పది రోజుల క్యాల్షీట్లు ఇచ్చాడంటే ఎంత బిజీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న సినిమాలోనూ బుల్లిరాజు కోసం ఓ స్పెషల్ పాత్ర రాసినట్లు తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *