మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలి వారసురాలిగా ఈమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుతోంది. అయితే పెళ్లి తర్వాత నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన నిహారిక విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ఈమె తమిళంలో మద్రాసకారణ్ (madraskaaran) అనే చిత్రంతో అలరించింది.
View this post on Instagram
నిహారిక ప్రొడక్షన్ లో మరో మూవీ
ఇక తెలుగులో ప్రస్తుతం వాట్ ది ఫిష్ (What The Fish) అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది నిహారిక. నటిగానే కాదు నిర్మాతగా సూపర్ స్పీడులో ఉంది ఈ భామ. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ (Pink Elephant Pictures) పేరుతో బ్యానర్‌లో ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు, ఓ సినిమా తెరకెక్కించింది. ఇప్పటికే ఈ బ్యానర్ లో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే నిహారిక ఇప్పుడు తన బ్యానర్ లో ఓ ఫీచర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తోందట.
View this post on Instagram
నిహారిక బ్యానర్లో ఫీచర్ ఫిల్మ్
ఈ ఫీచర్ ఫిల్మ్ ను మానస శర్మ (Manasa Sharma) తెరకెక్కించనున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో మానస క్రియేటివ్ డైరెక్టర్‌గా ఇప్పటికే రెండు సిరీస్‌లకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. జీ5 వేదికగా అలరిస్తోన్న ‘ఒక చిన్న ఫ్యామిలీ’, సోనిలీవ్‌లో టెలికాస్ట్ అవుతోన్న ‘బెంచ్ లైఫ్ (Bench Life)’ సిరీస్ లకు మానస దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఆమె డైరెక్షన్ లో మూడో ప్రాజెక్ట్‌గా ఫీచర్ ఫిల్మ్ రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.






