
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో మహాభారత్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప (Kannappa)’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివిధ చిత్ర పరిశ్రమల నుంచి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది.
మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న మంచు మోహన్ బాబు (Mohan Babu) పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప నుంచి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ (Glimpse of Mahadeva Shastri) ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో మోహన్ బాబు ఆయన నడుచుకుంటూ వస్తుండగా అందరూ మోకాళ్లపై కూర్చొని ఆయనకు నమస్కరిస్తూ కనిపించారు.
కనుబొమ ముడిచితే ఉగ్ర శాస్త్రి
పొడవైన జుట్టు, నుదుటిన విభూది, కాషాయ వస్త్రాలు, జపమాలలు ధరించి మహదేవ శాస్త్రి నడిచొస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ‘ఢమ ఢమ విశ్వలింగ, దిమి దిమి విష్ఫు లింగ (Om Namah Shivaya Song)’ అనే పాటతో గ్లింప్స్ మొదలైంది. ఈ పాటను శంకర్ మహదేవన్ పాడగా.. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ‘కనుబొమ ముడిచితే ఉగ్ర శాస్త్రి, కంగువ తెరచితే రుద్ర శాస్త్రి’ వంటి లైన్లు ఈ పాటలో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.