
బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps Case) వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో యాంకర్, నటి విష్ణు ప్రియ (Vishnu Priya Case) కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ నకు సంబంధించిన వివిధ అంశాలపై ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న ఇతర యూట్యూబర్లు విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ పై ఓవైపు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Telangana RTC MS Sajjanar), మరోవైపు తెలంగాణ పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలా మంది యువత వీటి బారిన పడి అప్పులపాలు అవుతున్నారు. వాటిని చెల్లించలేక చివరకు జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వీటికి దూరంగా ఉండాలంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
డబ్బులకు ఆశపడి ఇల్లీగల్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలుంటాయి. బెట్టింగ్, ఇల్లీగల్ ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేయడం, ఆడటం నేరమని గుర్తుంచుకోండి. #TelanganaPolice #SayNoToBetting pic.twitter.com/yNCFU5uK9C
— Telangana Police (@TelanganaCOPs) March 19, 2025
“జీవితాలను కబళించే ఆన్‌లైన్ గేమ్స్ జోలికి వెళ్లకండి. ఆకర్షణీయమైన వెల్‌కమ్ ఆఫర్లు, ఫ్రీ రివార్డ్స్ పేరిట వలవేసి సర్వం దోచేస్తారు. రమ్మీ సర్కిల్, ఆన్‌లైన్ కార్డ్ గేమ్స్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకండి. జీవితాన్ని ఆన్‌లైన్ గేమ్స్‌కు తాకట్టు పెట్టకండి.” అంటూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులకు ఆశపడి ఇల్లీగల్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్, ఇల్లీగల్ ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేయడం, ఆడటం నేరమని గుర్తుంచుకోండని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.