
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) షో గురించి తెలియని వారుండరు. ఈ షో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ (NTR), సెకండ్ సీజన్ నాని, ఇక థర్డ్ సీజన్ నుంచి మొన్న ఎనిమిదో సీజన్ వరకు నాగార్జున (Nagarjuna) హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఎనిమిదో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల తాజాగా నాగార్జున హోస్టింగ్ పై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వల్ల తనకు చాలా పాపులారిటీ వచ్చినా.. మళ్లీ ఆషోకు వెళ్లాలని మాత్రం తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది ఈ భామ.
నాగార్జున హోస్టుగా పనికి రారు
ప్రస్తుతం సోనియా ఆకుల ‘ఆర్టిస్ట్ (Artist)’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇందులో భాగంగా మీడియా బిగ్ బాస్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వంటి రియాల్టీ షోకు హోస్టుగా నాగార్జున కరెక్టు కాదని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. నాగ్ సర్ చాలా సాఫ్ట్.. ఆయన గట్టిగా మాట్లాడలేరని పేర్కొంది.
నాగ్ కంటే రానా బెటర్
“నేను షోలో మాట్లాడిన చాలా మాటలు మార్చేశారు. నేను అననివి కూడా తప్పుగా ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ షోలో హోస్టుది మేజర్ పాత్ర. వాళ్లు లేనివి ఉన్నట్లుగా చెప్పకూడదు. నాగార్జున సొంతంగా ఏం మాట్లాడరు. మైకులో ఆయనకు అవతలి వాళ్లు ఏం చెబితే ఆయన అదే మాట్లాడతారు. ఏమి ఆలోచించరు. నాగార్జున తప్పుకునే రానా హోస్టుగా వస్తే బాగుంటుంది. నాగార్జున హోస్టుగా ఉంటే నాకు మళ్లీ ఛాన్స్ రాదు. వచ్చినా నేను బిగ్ బాస్ షోకి వెళ్లను.” అంటూ సోనియా సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.