‘హోస్టుగా నాగ్ కరెక్టు కాదు’.. బిగ్​బాస్ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) షో గురించి తెలియని వారుండరు. ఈ షో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ (NTR), సెకండ్ సీజన్ నాని, ఇక థర్డ్ సీజన్ నుంచి మొన్న ఎనిమిదో సీజన్ వరకు నాగార్జున (Nagarjuna) హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఎనిమిదో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల తాజాగా నాగార్జున హోస్టింగ్ పై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వల్ల తనకు చాలా పాపులారిటీ వచ్చినా.. మళ్లీ ఆషోకు వెళ్లాలని మాత్రం తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది ఈ భామ.

Image

నాగార్జున హోస్టుగా పనికి రారు

ప్రస్తుతం సోనియా ఆకుల ‘ఆర్టిస్ట్ (Artist)’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇందులో భాగంగా మీడియా బిగ్ బాస్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వంటి రియాల్టీ షోకు హోస్టుగా నాగార్జున కరెక్టు కాదని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. నాగ్ సర్ చాలా సాఫ్ట్.. ఆయన గట్టిగా మాట్లాడలేరని పేర్కొంది.

Image

నాగ్ కంటే రానా బెటర్

“నేను షోలో మాట్లాడిన చాలా మాటలు మార్చేశారు. నేను అననివి కూడా తప్పుగా ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ షోలో హోస్టుది మేజర్ పాత్ర. వాళ్లు లేనివి ఉన్నట్లుగా చెప్పకూడదు. నాగార్జున సొంతంగా ఏం మాట్లాడరు. మైకులో ఆయనకు అవతలి వాళ్లు ఏం చెబితే ఆయన అదే మాట్లాడతారు. ఏమి ఆలోచించరు. నాగార్జున తప్పుకునే రానా హోస్టుగా వస్తే బాగుంటుంది. నాగార్జున హోస్టుగా ఉంటే నాకు మళ్లీ ఛాన్స్ రాదు. వచ్చినా నేను  బిగ్ బాస్ షోకి వెళ్ల‌ను.” అంటూ సోనియా సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *