
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ మాఫియా (Online Betting Mafia) వల్ల ఎంతో మంది అమాయక యువత ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది అప్పులపాలై రోడ్డున పడ్డారు. డబ్బు కోసం ఈ యాప్స్ ను కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయొద్దంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రమోట్ చేసిన 11 మంది యూట్యూబర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు రానా (Rana), లక్ష్మీ మంచు, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి వారికి నోటీసులు జారీ చేసింది.
సారీ చెప్పాంగా.. ఇంకేంటి?
అయితే ఈ నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి (Surekha Vani) కుమార్తె సుప్రీత కూడా ఉంది. ఈమె గతంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వీడియోలు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఈమె (Supritha) క్షమాపణలు చెబుతూ ఇంకోసారి అలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయనంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖా వాణిని ఈ వ్యవహారంపై ప్రశ్నించగా ఆమె తీవ్రంగా స్పందించారు. తెలిసో తెలియకో చేశాం.. క్షమించమని అడిగాం ఇంకా ఈ ప్రశ్నలేంటి అంటూ మండిపడ్డారు.
Check the arrogance of Supritha mother Surekha Vani when reporter asked about promoting betting apps
No regret for crimes they’ve committed just pure arrogance
Zero respect for the lives ruined by betting apps Shameless!#SayNoToBettingApps #StopBetting #SuprithaBandaruNaidu pic.twitter.com/Czs9tRCjdy
— Laxmi Tweets (@Laxmi_Tweets_9) March 18, 2025
అసలేం జరిగిందంటే..?
తాజాగా ఫోన్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖా వాణిని యాంకర్.. బెట్టింగ్ యాప్ మాఫియా గురించి ప్రశ్నించారు. వాళ్లు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారంటూ ప్రశ్నించగా.. తాను, తన కుమార్తె ఎప్పుడూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని.. వాళ్లు పెట్టిన పోస్టులు రీపోస్ట్ చేయమంటే చేశామని చెప్పుకొచ్చారు. అదేంటో తెలియకుండా ఎలా రీపోస్ట్ చేశారని అడిగితే.. ‘తెలియకనే చేశాం.. అందుకే సారీ చెప్పాం. తెలియకుండా ఎందుకు చేశారని అడిగితే ఏం చెబుతాం..? అదేం క్వశ్చన్?’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపైనా మరో ప్రశ్న అడగబోతుంటే.. ‘మీకు తెల్లారిందేమో అమ్మా.. మాకు ఇంకా తెల్లారలేదు ఉంటా’ అంటూ సురేఖా వాణి ఫోన్ కట్ చేశారు.